Tuesday, September 7, 2010

22 కారెట్ల సంతోషం ........









22 తలుపులు తెరిచిన తర్వాత .....ఆత్రంగా దూకుతూ పరవళ్ళు తొక్కే ......కృష్ణమ్మను చూసిన తర్వాత మాకు కలిగే ఆనందం కూడా 22 కారెట్ల తో సమానమే కదండీ !
  అందుకే 22 గేట్ల ఎత్తివేత = 22  కారెట్ల బంగారపు సంతోషం  అన్న మాట !
******************************************************
    ఉదయం ఏడు గంటల పదినిమిషాలు ..........సెప్టెంబరు ఐదవ తారీఖు !

            పదిహేను రోజుల క్రితం అనుకున్న ప్రకారం ఈ రోజూ నాగార్జున సాగరు  వెళ్దామనుకున్నాం . రమణ రాక  సందర్భం లో ...కలుసుకున్నప్పుడు వచ్చిందీ ప్రస్తావన ! ఎలాగైనా వెళ్ళాలనుకున్నాం ! అందుకే  ' లకిడీ కా పూలు '  లోని ' సదరన్ ట్రావెల్స్ ' ఆఫీసు వద్ద కలిసి ఓ మినీ బస్సు లో బయలుదేరదామనుకున్నాం ! నేను అంతకు ముందు రాతిరే హైదరాబాదు వచ్చి మా డాక్టర్ల విశ్రాంతి భవనం లో  దిగి....ప్రొద్దున్నే తయారయి ప్రారంభ పాయింటు కు చేరుకున్నా! అప్పటికే దాదాపు అందరూ వచ్చారు . 







ఈశ్వర్ , హరిబాబు , మురళీధర్ యాదవ్ 
పాండురంగారావు , రమణ , డా:శివ దాస్ 
వై. వి.ఆర్ , రవీంద్ర నాద్ ,ఎ .వి వి . ప్రసాద్ 
డా : శాస్త్రి  మరియు వీర మహేందర్ అందరూ సిద్ధం గానే వున్నారు. నేను వెళ్ళిన కాసేపటికి  కళ్యాన్ కూడా వచ్చాడు . ఏడున్నర కు బస్సు బయలుదేరింది !మార్గ మధ్యం లో సాగర్ x రోడ్ల దగ్గర మురళీ ధర్ మరియు డా. గోవర్ధన్లు మాతో కలిసారు . ముందస్తు ప్రణాళిక ప్రకారం బదరీ వాళ్ళ ఫాక్టరీ  దగ్గర టిఫినీలు చేద్దామనుకున్నాం  (అది సాగరు దారిలోనే వుంది ). 





                                                 అన్ని రకాల టిఫిన్ లు నేను ఎక్కడా చూడలేదు . ఆ ఫోటోలు చూస్తే  మీకు తప్పక నోరూరుతుంది . కోసిన బొప్పాయి ముక్కలు  ,


 గింజలు  కూడా లేకుండా తీసి ముక్కలు చేయబడ్డ పుచ్చకాయ , కేసరి  , దిట్టంగా నేయి మరియు జీడిపప్పులు వేయబడ్డ పొంగలి , ఉప్మా , వడ , పొంగడాలు
ఆహా......ఏమి రుచి .......!


 , నాలురకాల చట్నీలు మరియు ఆరు రకాల వేడి శీతల పానీయాలతో .......సాగరు టూరు లేక పొతే .....శుభ్రం గా తిని అక్కడే పడుకునేలా వున్నాయి ఆ వంటకాలు .
అనరా ......మైమరచి !




 కడుపారా తిని ...మనసారా ' బద్రి ' ని ఆశీర్వదించి ఆయనతో సహా  బయలుదేరాం !ఈ లోగా కృష్ణా రావు కూడా తన సొంత వాహనం తో పాటు మాకు జత కలిసాడు. అలా అందరం కలిసి  ఓ పది హేడు మందిమి అయ్యాము ! టూరు షురూ !
******************************************* 
     టూరు షురూ అనుకునేంత లోపులో మా  ఆనందం ఆవిరయ్యే దృశ్యం ........ఎ.పి.పి.స్. సి లో 'తెలంగాణా వాటా ' ఖరారు చేయమంటూ తెలంగాణా విద్యార్ధుల ధర్నా ! యాచారం దగ్గర ' రోడ్డు బందు ' !


                                      ఓ అర్ధ గంట తర్వాత మరో అడ్డ కచ్చా దారి వుందని తెలిసి అటు పరుగులు తీయించాము బస్సుని ! డ్రైవరు  అయిష్టం గానే  బస్సును నడిపించాడు .


  ఎందుకంటే అప్పటికే .......ఇబ్రహీం పట్నం లో ధర్నా జరుగుతుందనే అడ్డ దారులలో వచ్చాం !మరలా  ఈ అడ్డదారిని చూడగానే ...చిరాకనిపించినా ...తప్పదుకదా ! మొత్తానికి ఓ గంట సమయం వృధా ! ఇక మళ్ళీ ఎక్కడా అడ్డంకి వుండదు అనుకుంటుండగానే    ' మాల్ ' దగ్గిర మళ్ళీ ' ధర్నా ' ! 
   
 ఈ సారి లాభం లేదనుకుని ఇద్దరు మురలీధరులు , వై . వి . ఆర్ . లు కలిసి వాళ్లతో పాటు డాన్సు ఆడి వాళ్ళ బానరు ను మెడలో వేసుకుని ఎలాగోలా వాళ్ళను ఒప్పించి , మెప్పించి సందు  చేసుకుని బయటపడ్డాం !ఒకటిన్నర కల్లా సాగర చాయల్లోకి వచ్చాం . లెఫ్టు కెనాల్ దాని చుట్టుపక్కల రోడ్డు వరకూ విస్తరించిన  ఆ నీటి సొగసులు చూడగానే ఆనంద  పారవశ్యం మొదలయ్యింది మా మనుసు లలో  !చూస్తుండగానే డాము వచ్చింది. వంతెన  మధ్యలో బస్సు ఆపి తనివి తీరా హోరు తో కూడిన నీటి పరవళ్ళు తిలకించి , కెమేరా ఆర దృశ్యాలు బంధించి బయలు దేరాము !
ఆడవే జలకమ్ము లాడవే !
     
ఎనాళ్ళ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకూ ....
..క్రిస్నమ్మ పొంగింది చాన్నాళ్ళకు !

వరల్దు బాంకు అధికారే ఐనా ...ఈ క్రిస్నమ్మకు బిడ్డే  కదా !

ఎంత కార్డియాలజిస్తు ఐనా ...అందరికీ తీపి రసం తాగించి నీవు మాత్రం తాగకుందా వుంటావా !













దక్కినదే .....చిక్కినది !

రొంబ హ్యా పీ గురూ...........!
మా సంతోషపు జోరు...ఆ సాగర హోరు ముందు ....సెల్లు కబుర్లు బోరు !









'' ఏంటి హరీ ఆలోచిస్తున్నావ్ '' ?
'' ఆ ......ఏమీ లేదు ....మిగతా ఆ నాలుగు గేట్లు ఎలా ఎత్తిద్దామా ? అని ఆలోచిస్తున్నా '' ?
ఈయన తక్కువోడు కాదు....ఏం చేస్తాడో చూడండి !

నేను గానీ ..ఈల గానీ వేసానంటే ...మిగతా నాలుగు గేట్లు  లేపుతారు !







బంధనాలు తెంచుకొని ..........



బంధుజలం  కలుపుకొని ......


స్వాగతిస్తున్నా మీ రాకను !


చూసింది చాలు .....ఇంకా చూడాల్సింది  చాలా వుంది...బయలు దేరండి  బాబుల్లారా!




విజయ పురి వైపు.........


**********************************************************************************************
దాదాపు సమయం ఒకటిన్నర  కావొస్తుంది . బద్రీ పున్నేమా అని ఆకలి కూడా వేయడం లేదు . మా కాలంలో  ...మా కాలేజీ కి వెళ్ళాలంటే ...హిల్ కాలనీ , పైలాన్ మీదుగా డాం దాటి విజయపురి సౌత్ లో దిగి అడ్డ దారిన  కాలేజీ కి వెళ్ళే వాళ్లము . కానీ ఇప్పుడు పైలాను ను చూసే భాగ్యము లేదు ....డాం మీద వెళ్ళే ఆవకాశం అంతకన్నా లేదు !దాదాపు మాచర్ల రోడ్డు లో సగం నుంచి వెనక్కు తిరిగి దక్షిణ విజయ పురి వెళ్ళాలి . డాము అందాలు జ్ఞాపకాలు అవిరైపోకముందే ' ఘాటీ ' రోడ్డు మొదలయ్యింది. మొదలవ్వగానే మేము చదివిన మొదటి సంవత్సరపు ' టైగర్ వాలీ ' స్మృతులు గుర్తుకొస్తుండగానే......' షావోలిన్ గుడి ' లా కనిపించే  ఆ షెడ్లు కనబడసాగాయి .

అదివో....అల్లదివో....మా టైగరు వాసము !

వేలానుభూతుల  బహు బ్రహ్మ మయమూ !
ఇంతకు ముందు ఆ దారిలో వెళ్ళాము కానీ .....లోపటికి  వెళ్ళే వీలు చిక్కింది కాదు. అందుకే ఈ సారి ఎలాగైనా వెళ్లాలని కృతనిశ్చయం తో బస్సు ను అటువైపు తిప్పాము . ఇదిగో అప్పటి మా మొదటి సంవత్సరపు కాలేజీ ఇలా రూపాంతరం చెంది ఇలా కనబడింది .....చూడండి మరి !
అనుభూతుల దొంతరల ....ఆలవాలము ఇదే కదూ ?

ఆనాటి చెలిమి ఒక కల ....కల కాదు నిజము ....మేమిలా !

ప్రస్తుతం అది ఓ ప్రయివేటు స్కూలుకు ఆలవాల మయ్యింది ! ఆదివారమేమో పిల్లలను చూడడానికి వచ్చిన తల్లీ -తండ్రులతో....తెచ్చిన కారేజీ వంటకాలతో మా ఆకలిని మాకు గుర్తుకు తెచ్చేలా మాంచి సందడిగా వుంది .పిల్లలను చూసుకుంటూ ....పలకరిస్తూ ....ఓ చుట్టూ చుట్టి ఫోటోలు దిగడం మొదలు పెట్టాము .

















పిల్ల కాయలు 



కోతి మూకలు 


అప్పట్లో ఇక్కడ నీళ్ళ తొట్టి వుండేది !


అప్పటి డా ర్మెంటరీలు !


ఆఫీసు 

ఆ నలుగురు......కారు !


శివ నైపుణ్యం 


standing lt. to rt haribaabu,krishnarao ,kalyan ,shastry , muralidhar , avv prasad .badri , eswar , veera mahender and me .
sitting: ramana , y.v.r , ravindranadh . shivadas , pandurang ,murali dharyadav ,and govardhan .

అలా కాలేజీ చుట్టి ......జ్ఞాపకాలు ఒడిసి పట్టి.....ఇలా ఫోటోలకు ఫోసు పెట్టి ...నక నక లాడే కడుపులతో భోజనానికి మా నైవాస్య కళాశాలకు బయలుదేరాం .

***************************************
*****************************************
నిన్నటి దాకా వర్షాలతో అదరగొట్టిన వాతావరణం మా ఆనందం పాడు చేయడం ఇష్టం లేక కాబోలు .......ఆహ్లాదకరం గా మారింది. సాగర జలాశయం గంభీరతను తిలకిస్తూ , మారిపోయిన పరిసరాలను మా అప్పటి పరిసరాలతో అన్వయించుకుంటూ....సరి పోల్చుకుంటూ ముందుకు వెళ్ళసాగాము . కాలేజీ కి వెళ్ళే దారిలో వంపు తిరిగే చోట ఎడమ వైపు ఉన్న అందమైన గెస్ట్ హౌస్ .....శిధిల జీవిగా కనబడటం ....మనసుకు కాస్త బాధ కలిగించింది . ఆ బాధ లోంచి తేరుకునేలోగానే కాలేజీ వచ్చింది !ఒక్కసారి కళాశాల గీతం గుర్తుకు వొచ్చింది !
                    '' జయహో నైవాస్య కళాశాల ....జయహో చతురాస్య మనో హేలా !''


బస్సు దిగగానే ప్రిన్సిపాలు గారు మిగతా సిబ్బందితో సహా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు . అప్పటికే ఆలస్యమైందేమో ముందుగా భోజనానికి ఉపక్రమించాము . మా కోసం స్టాఫు రూములో ఏర్పాటు చేయించారు. మేమూ ముందుగానే అనుమతి తీసుకున్నందు వల్లనూ .....భోజన రుసుము చెల్లిస్తామని చెప్పినందువల్లనూ ....నియమాలు కాస్త పక్కన పెట్టి ....చేప , కోడి మరియు మటన్ కూరలతో పసందైన భోజనమే పెట్టారు . మేమూ కూడా మొహమాట  పడకుండా ఆ పసందైన కూరలతో ...కడుపులో సందు లేకుండా విందును ఆరగించాము  .
     












                                        









.....


అలా మొత్తానికి భోజనాల అంకం ముగించి .......ప్రిన్సిపాలు గారి చాంబరులో మీటింగు కు ఆసీనులమయ్యాం  !
                          






























































కాలేజీ ప్రిన్సిపాలు గారి అధ్యక్షతన ప్రారంభమైన  సమావేశం ఓ గంట పాటు సాగింది. ప్రిన్సిపాలు గారు కాలేజీ బయో-డేటా తో పాటు సజావుగా ఎలా నిర్వహిస్తున్నారో వివరించారు. మరో ఔత్శాహిక అధ్యాపకులు కూడా తమ సమిష్టి కృషిని వివరించారు !


           










అన్నిటిని మించి మా అదృష్టం ఏమిటంటే ......కాస్తో-కూస్తో మాకు ఇంగ్లీషు వచ్చిందంటే...ఎవరి పుణ్యమా అని   మేము తలచుకుంటామో .....ఆ మాస్టారి దర్శన భాగ్యం కలగటం , గురు పూజోత్సవ దినాన వారి ఆశీస్సులు పొందటం  మాకు చాలా ఆనందం కలిగించింది .వారే .....వి.యల్ .యన్ గా పిలవబడే ' నరసింహ రావు ' మాస్టారు . ఆ మహానుభావుని చూడడమే కాకుండా ఆయనతో అలనాటి మా అనుభూతులు పంచుకునే ఆవకాశం లభించడం ....అయాచిత వరమే !
















'నర సింహా ' వలోకనం !  
















మా వ్యక్తిగత పరిచయాలతో పాటు అక్కడి సిబ్బంది పరిచయాలతో సాయంత్రం మూడు గంటల కల్లా సమావేశం ముగించి అందరం కలిసి కాలేజీ  ప్రాంగణం చూడడానికి బయలు దేరాము !
      అందరూ తమ తమ పాత రూముల  దగ్గర ఫోటోలు దిగారు. ఆయా రూముల్లో వున్నఇప్పటి విధ్యార్ధులతో ముచ్చటిస్తూ ....తమ పాత అనుభూతులను వాళ్ళతో పంచుకున్నారు . పరిసరాల మరియు వ్యక్తిగత రూముల శుభ్రత విషయాలలో లోపమనే అంశం మాత్రం కాస్త మనసు చివుక్కుమనేలా చేసింది.అందుకే అప్పటి  మా ప్రతిరూపాలుగా అనిపిస్తున్న ఆ లేత ముఖాలతో కాస్త 'ఇంటర్ -యాక్టు ' అవసరమనిపించింది ! ఎలాగూ ' గురు పూజ దినోత్సవం ' సందర్భంగా వేదిక తయారయింది కాబట్టి అందరినీ ముందుగానే అసెంబుల్ కమ్మని చెప్పాం!
















శాస్త్రీయ-శివ చిద్విలాసం !




















మురళీ-వెంకట -గోవర్ధన నందనం .
















శయ్యా- సదనం 


హరి కల్యాణం 
















అప్పటి మా ఆట స్థలం చూసి కూడా బాధనిపించింది. అక్కడ ఎలాంటి ఆటలు ఆడుతున్న దాఖలాలు కానీ  , డ్రిల్లు జరుగుతున్నా రుజువులు కానీ అక్కడా కనపడలేదు . బహుశా వర్షాకాలం  అవడం వల్ల పొదలు పెరిగి నిరుపయోగంగా మారిందేమో అని సరిపెట్టుకున్నాం !
ఏవి తల్లీ అప్పటి మా కరసేవల గురుతులు ......?

అక్కడున్న చెట్లూ చేమలను కళ్ళతో పలకరించి సరదాగా అక్కడున్న చెట్లతో మాత్రం కోతి - కొమ్మచ్చి ఆడు కున్నాం !
సైయా ........సై ........ చేయి వేయ్













అప్పుడు ఆడలేని ఆటలు .....ఇప్పుడు ఆడదాం !

















సరదాల పర్వం అయిపోయాక ......సామూహిక  కలయిక పర్వం మొదలయ్యింది !మేము సిబ్బంది స్టేజీ కి ఓ పక్కన ...పిల్లలందరూ వరుసగా అమర్చబడిన బెంచీల మీద కూర్చున్నారు ! మొట్టమొదటగా పాండురంగారావు మేము వచ్చిన ఉద్దేశ్యము , సమావేశమైన కారణం తెలియచెప్పి అందరినీ పేరు పేరునా పరిచయం చేస్తూ ...మేము ప్రస్తుతం ఏమేమి చేస్తున్నామో చెప్పి ...అందరూ ఎటువంటి కుటుంబ  నేపధ్యంలో నుంచి వచ్చారో ' ఇప్పటి వాళ్లకు - అప్పటి మాకు ' పెద్దగా  తేడా యెమీ లేదంటూ ముక్తాయించాడు కూడా !


వీడని పసితనం 


























మేము ఒకప్పుడు ఇలాగే !























సి. యి .సి  దేనికీ తీసిపోదని .............

పదిహేను కళాశాలల యజమానిగా ( సైంటు మేరీస్ గ్రూప్ ) ఎలా ఎదిగాడో ....వివరిస్తున్న
కృష్ణా రావు !
మన వ్యక్తిత్వం మన మెలా తీర్చిదిద్దుకోవాలో వివరిస్తున్న ప్రసాద్ !
అసలు పిల్లలతో ' స్పందన- ప్రతిస్పందన ' భేటీ వుండాలని పట్టుబట్టి ఏర్పాటు చేయించింది ప్రసాదే !మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా , పరిసరాలు శుభ్రం గా ఉంచుకొని , సమాజ హితవు తో పాటు తమ తమ వ్యక్తిత్వ -వికాసానికి ఎవరు ఎలా మసలుకోవాలో ,మలుచుకోవాలో చాలా చక్కగా వివరించాడు.ముఖ్యంగా రమణ వరల్డు బ్యాంకు అధికారిగా (ఆల్టర్ నేటివ్ -ఎనర్జీ )చాలామందికి నచ్చాడు .తన సందేశం తో అందరి మనసులు చూరగొన్నాడు. చివరగా నా జోకు ....పాటతో కార్యక్రమం ప్రమోదంగా ముగిసింది....ఆ సాయం సమయాన స్వచ్చమైన నవ్వుల హరివిల్లు విరిసింది. 
             మా మాటలు వాళ్ళను ఎంతగా ప్రభావితం చేసాయంటే .........మా హాజరీని వాళ్ళు ఎంతగా ఇష్ట పడ్డారంటే ..........అంతవరకూ మామూలు అతిధులమైన  మేము ఒక్కసారిగా ' సెలబ్రిటీస్ ' గా మారిపోయాం .

                           

 యెంత  ' సెలబ్రిటీస్' గా ఆంటే...ప్రతి ఒక్కరు మా చుట్టూ గుంపులు గుంపులు చేరి కరచాలనం తో , సందేహాలతో మరియు ప్రశ్నలతో ముంచెత్తే అంత ,వాళ్ళ అభిమానపు వర్షపు జల్లులలో తడిసి ముద్దయ్యేటంత ......మా బస్సు బయలుదేరుతుంటే దారి పొడుగునా నిల్చొని వీడ్కోలు చెప్పేంత ! వాళ్ళను వీడుతోంటే మా ఆత్మ  మా దేహాన్ని వీడి వాళ్ళ చుట్టే తిరుగుతున్నంత .                          నిజం..........అది అవ్యక్తమైన భావం . గుండె నిండుగా సంతృప్తి  నిండి , దేహం తేలికయ్యి సాగర జలాలలో తేలియాడినంత అలౌకికమైన సంతోషకర భావం.....భార రహిత స్థితీనూ . అది అనుభవిస్తేనే గాని తెలియదు. ఇంతకు ముందు ఎన్నో సార్లు సాగర్ వచ్చాం కానీ ఇంతటి ' సంతృప్తి ' ఎప్పుడూ కలగలేదు....మిగలలేదు కూడానూ !అందరి మొఖాలలోనూ గంభీరతతో కూడిన సంతృప్తి తొనికిసలాడింది......సుబ్రహ్మణ్యం , మదన్ మరియు సునీల్ రాలేదన్న కాస్త అసంతృప్తి తప్ప .
దీని మీద నడవడం ఇక కలేనా ?

                        తిరుగు ప్రయాణంలో ఒకసారి డాం మీద నడుద్దామని ప్రయత్నించాం  కానీ....ఎవరినీ అనుమతించకపోవడం వల్ల సఫలీక్రుతులం కాలేకపోయాం
కొండకు వెళ్దాం .....

 మరో సారి రిసెర్వాయర్ అందాలు తనివితీరా చూసాం .అప్పటికే సాయంత్రం ఆరు గంటలు దాటింది .ఇక కరగని స్మృతులతో  , చెరగని నగవులతో , వెనకకు తిరిగిన మనసుతో తిరుగు ప్రయాణం మొదలెట్టాం.దొంగతనంగా
రైట్ కెనాల్ 

 సినిమాలు చూసిన ' రామకృష్ణ సినెమా హాలు , రైటుకనాల్ చూసుకుంటూ కొత్త బ్రిడ్జి కంటే ముందు వచ్చే 

ఘాటీ మలుపు దగ్గర మరోసారి బస్సు ఆపి వీడుకోలు చూపులతో 34 కళ్ళను 34 వేల కళ్ళు  చేసుకుని నా /మా జ్ఞానఆర్జన కారణ దాయని నాగార్జునసాగరు డామును తడిమి మరీ సెలవుతీసుకున్నాం   .
ఇంత మంచి మధురానుభూతిని మిగిల్చిన ఈ టూరు విశేషాలు ముగించే ముందు....దీనిని ముందుండి అన్నీతానై నడిపించిన , భరించిన , నిర్వహించిన బృందావనం లో 'క్రిష్'నుడికి (వై.వి.ఆర్ ) కృతజ్ఞతలు తెలుపకపోతే అది అసమంజసమే అవుతుంది . ' స్నేహితుల మధ్య కృతజ్ఞతలు ఏంటి  గురూ ' అని తను తీసి పారేసినా ....అతని సహృదయతకు ఓ సలాం కొట్టడం మా కనీస బాధ్యత , కర్తవ్యమ్ కూడానూ ! అలాగే కళ్యాన్ , రవీంద్ర నాద్ , హరిబాబు మరియు పాండులకు ఈ పుణ్యంలో సింహభాగమే వుంది. ఇక ఇంతటి కమనీయ కావ్యం లో పాత్రదారులైన  మిగతా మిత్రుల గురించి చెప్పేదేముంది. అందరం కలిస్తేనే కదా ....డెందములు   నిండిన సందడి. అమ్మ ఒడి లాంటి సాగరు బడికి ....కృష్ణమ్మసడికి .....దరిచేరాయి మా కరముల జోడి , శతకోటి అనుభూతులతో  ప్రనమిడి!
మళ్ళీ కలుస్తాం ..............ఈ గాలి పీలుస్తాం !
    


28 comments:

  1. Awesome account! You really live through your heart!! Beautiful photos

    ReplyDelete
  2. Thank you subbu !
    I need some inspiration through your comments. i will finish all d incomplete blogs soon .

    ReplyDelete
  3. Hi Ramana:
    I love reading your blogs, and have been silent admirer of your tact with Telugu in expressing your feelings.

    The photos certainly remind a sojourn into the past. Though I missed it, I got the essence of it, without footing a heavy bill for my veg lunch.

    Hope that you enjoyed the hospitality.

    I think, the movement of time as in the space of things that we see can be possible as memories like the Sagar ones emerge into the present. That is in some sense, a thread to bind us to recall those short and memorable days.

    Kudos to the organizers.

    v
    With the best regards,
    Venkat

    ReplyDelete
  4. Thank you Venkat !
    I promise you to finish this ....with some more photos and d real interesting n 'inter-acting end' of the tour which left us a ut-most satisfactory note . Keep watching !

    ReplyDelete
  5. "When to the sessions of sweet silent thought,
    I summon up remembrance of things past."
    Sonnet30: Shakespeare.

    My dear Mehbooba,
    It's a lovely narrative.
    Plz go ahead and finish it.

    AVV.

    ReplyDelete
  6. Thank you !
    o.k....grammo.....I will finish it on sunday !

    ReplyDelete
  7. మీ బ్లాగు టపాని ఈరోజు చూడటం వీలయ్యింది.. ఆలస్యముగా చూస్తున్నందులకు నన్ను మన్నించగలరు.. లేటుగా చూస్తున్నా లేటెస్టుగా చదివాను..

    చాలా చాలా బాగా వ్రాశారు. అసలు ఒక దోషముందేమో అనిపిస్తున్నది. అదేమిటంటే - ఇది 22 క్యారట్లు కాదు 24 కారట్లు అని పెట్టాల్సింది. ఇప్పటికైనా మార్చగాలరేమో ఆలోచించండీ!

    టైం మేషీన్ వాడి గత కాలము లోకి వెళ్ళినట్లుగా, ఈ మీనీ బస్ వాడి గత మధురస్మృతులలోకి వెళ్లారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలుగజేసింది. మీ మిగతా తరవాయి కూడా చదవాలని ఆత్రుతతో ఉన్నాను. త్వరలోనే ఆ భాగాన్ని కూడా వ్రాస్తారని ఎదురుచూస్తున్నాను..


    అలాగే వర్డ్ వెరిఫికేషన్ నీ కూడా తీసేయగలరు. దానివలన ఇబ్బందే కానీ ఏమాత్రం లాభం లేదని గమనించగలరు.

    ReplyDelete
  8. మిత్రమా రాజ్ !
    26 సాగర్ గేట్లలొ ఆ రొజు 22 గేత్లు మాత్రమే యెత్తారు. అందుకే అలా వాదాను 22 కారెత్లు అని . ఇక పొతె ఈ వర్ద్ వెరిఫిచతిఒం సంగతి అసలు తెలియదు . ఒకసారి ఎలా తీసివెస్తారో చెపితే తీసెస్తాను. అలాకె ...ఇంతకు ముందు కూదా ఒకసారి సాయం చేసారంతే నమ్మారు కాదు. అది కూదా మన పరిచయం లేక మునుపే.
    లింకు పంపిస్తా చూడండి !
    http://madhuramesudhaaganam.blogspot.com/2010/04/blog-post.html

    ReplyDelete
  9. సారీ !
    అక్షర దోషాలు చాలా వున్నాయి ! గేట్లు , వాడాను , కారెట్లు వెరిఫికేషను చేసారంటే , కూడా , .......అని బదలాయించుకోగలరు !

    ReplyDelete
  10. అయ్యో!.. మీరు దీనికి ఇలా - మాటి మాటికీ సారీలు చెబుతూ ఉంటుంటే నాకు ఏదోలా ఉందండీ!.. నేను మీకన్నా అన్నింటిలో చాలా చిన్నవాడిని. ఇలా అంటున్నాను అని మీరు ఏమీ అనుకోవద్దు.

    మీరు 22 క్యారట్లు ఎందుకు పెట్టారో తెలీక అలా వాగాను. ఆ సాగర్ కి ఉన్న 26 గేట్లలో 22 గేట్లు ఎత్తారు అని నేను గమనించుకోలేదండీ. నా దుందుడుకు చర్యని మన్నించండి.

    వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యటం చాలా ఈజీ!.. ఇలా చెయ్యండి.

    1. మీ బ్లాగర్ హోమ్ పేజీలోకి వెళ్లి Settings ని నొక్కండి.
    2. ఆ తరవాత Basic Publishing Formatting Comments Archiving Site Feed Email & Mobile OpenID Permissions అని ఉన్న టాబ్ లలో Comments మీద క్లిక్ చెయ్యండి.
    3. అలా ఓపెన్ అయ్యాక అందులో (పదవ ఆప్షన్)Show word verification for comments? అని ఉంటుంది.
    4. అక్కడ మీరు Yes అని పెట్టి ఉంటారు.
    5. దాని ప్రక్కనే ఉన్న No మీద క్లిక్ చేసి క్రింద Save Settings మీద క్లిక్ చెయ్యండి అంతే!.. చాల సింపుల్.

    మళ్ళీ చెబుతున్నాను. నేను చేసిన సహాయాలు మరచిపోతాను - అలా గుర్తుపెట్టుకుంటే ఎక్కడ కళ్ళు నెత్తికి ఎక్కుతాయో అని. నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చెబుతాను.

    ReplyDelete
  11. nee photos ramaneeyam gaanu, nee maatalu bahu sarada gaanu unnayi. dhanula maithimi mithrama.
    Pradeep

    ReplyDelete
  12. are u a rabbit? always mentioning carrots......

    except for "food godava" remaining content is very good.keep it up.

    konchem food meeda mamakaaram champuko guru.

    you can become good writer!

    bye! all the best to your pen.

    dr.ravindranath--siddipet.

    ReplyDelete
  13. chittam mandhurala vaaru!
    Tama aantaryamu grhinchitini. ee yayasulo nenemee kottagaa ' rachayita ' avvaalsina pani ledu kaani..........andari maatagaa raasaanu. naa sonta abhipraayamu kaadu.
    Ippati kainaa chadivinanduku......krutagjnatalu.

    ReplyDelete
  14. dear sir/s,

    Ramanamurty gari sudheergha blog ni choosi chalinchanu. " Enni kankshala sree gandhammu.... moota kattukunnano....."- i came to know from this blog. kaani manasulo 22 gates ettivetha...hostel drusyalu... cvnrao gari darsanabhagyam(photo)...nenakkada enduku leka poyano ani chaala badha vesindi... kaneesam maa ramanamurthy garu.. okarakamga at least mee group lo kondarini niswarthamu ga daggara chesina koddipati prasamsa pondinivadini... mee batch kakapothe kakapoyanu....special invitee gaa pilipinchukolekapoyanu...ane badha matram meedu mikkili ga feel avutunnanu... deeniki karanam meere ani kooda gattiga analeni gourava bhavam...adee kooda nagarjunasagar visit kaabatti... edo hrudayam lo melipedutoondi...maatalaku andani bhavalu kadu badhalu............aa madhura kshanalu vere vaallu anubhavistoounte... asooya... inka chala viseshanalu..... lakshminarayana, 77-79 batch...

    ReplyDelete
  15. blog chala bagundi...
    By reading it, I memorized my experience.. the stay in the college..
    Thanks to you..

    ReplyDelete
  16. superb...........

    ReplyDelete
  17. @ venkatesh and kumar !
    Thank you very much !

    ReplyDelete
  18. innallu mee blogs chadavaka nenu chalane time waste chesanandi. chala baga raseru. nagarjunasagaru ki nenu kooda vellanu 2 saarlu maa nannagaru theesukellinappudu oka guest house lo digemu
    just dam ki pakkane........poddute lechi choosthe entha bagundo.
    aa rathri nidra pokunda aaru baita park lo koorchuni vennello thilakinchamu krishnamma andalu. ahaaaaa
    entha madhuramaina vishayalanu malli gurthu cheseru mee blog dwara. mee sneha brundam dhanyulu. ila malli aa prnathaniki velli anni choosi ragaliginanduku. mee andariki congrats.

    ReplyDelete
  19. !!!!!!!!!!!!!!!!!!.
    saagareturala daggarinunchi...ilaanti comment/prasamsalu vastaayani assalu oohinchaledu. opikagaa chadivinanduku ...dhanyavaadamulu. Right canal vaipu guest house lannii padagottesaaru. Bahusaa meeru cheputunnadi ' vijaya vihaar' emo? Akkadi nunchi dam back side mariyu reservoir andaalanni baagaa kanabadataayi !

    ReplyDelete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
  21. Dear Sir

    I am thrilled to read this blog sir. I am from 95-97 batch, thank you for taking time and narrating this experience. I always love to remember my Sagar memories. nenu 22nd December 2007 na last time vellanu. Poddunna assembley nunchi evening assembly varaku undalani vellanu. Started byfirst bus at MGBS at 4:15AM and reached JC around 8:55AM. I spent whole day on that day, it was a great experience for me. adee friends kudaa untee inka super gaa untundi.

    Kishore Kota

    ReplyDelete
  22. మాష్టారు ప్రతి ఒక్క అక్షరం చదువుతుంటే కళ్ళముందు జరుగుతున్నట్టే అనిపించింది....చదువుతున్నంత సేపు నేను అక్కడ ఉన్న అనుభూతిని పొందాను....ఇంక ఫోటోలు అన్నీ కూడా చాలా బాగున్నాయి...

    ReplyDelete
  23. Sir
    It's so beautiful and wonderful

    ReplyDelete
  24. Wonderful content. Feeling nostalgic seeing the pics.

    ReplyDelete