Monday, March 22, 2010

అపూర్వ కలయిక



**అడవి రాముడు -అపూర్వ కలయిక లొ 'అడవి రాముడు ' గురించి చదివారు ఇక ' అపూర్వ కలయిక' కూడా చదవండి .**

*31 సం . తర్వాత*

అపూర్వ కలయిక :

మధురమైన జ్నాపకాలు... మనిషికొకటి -రెండు చాలు !
వ్యధా తప్త హ్రుదయ వీధి ......సుధా వ్రుష్టి కురిసేందుకు !

(అవును ......మనం ఎంత బాధల్లో వున్నా ....ఎంత చీకాకుల్లో వున్నా .......ఓ మధురమైన జ్నాపకం అవన్నీ మరచిపొయేలా చేస్తుంది !)

మనసు భవుతికంగా ఇక్కడ వుందే కాని ........మానసికంగా ఐతే హైదరాబాదు లో 'country club' లో వుంది. మనసంతా ' ఉద్విగ్నం' గా వుంది.....ఈ రోజే మా 'సాగర మిత్రుల కలయిక' ....అదీ 31 యేండ్ల తర్వాత ! 'యెన్నాళ్ళో వేచిన హ్రుదయం ....ఈనాడే యెదురవుతుంటే '......అన్న పాట ఎవ్వరూ పాడకున్నా కూడా ...చెవుల్లో మారుమోగుతున్నట్లే వుంది ! అప్పట్లో నాకు గుర్తున్న మొఖాలన్ని సినిమా రీలు తిరిగినట్టు కళ్ల ముందు కదలాడుతున్నాయి! సునీల్....మంధరుడు(రవీంద్రనాధ్) ...హేమసుందర్ .....మురళీధర్.. ...రాములు...చలం...రామక్రిష్న ...గోవర్ధను...రేగికంపలా వుండే జుట్టు తో వుండే రాం గోపాల్ ....అప్పట్లోనే అమ్మాయిలకు సైటేసే విజయ్ కుమార్ ....లక్ష్మా రెడ్డి .....అడవిరాముడు...శాస్త్రి ...అనకాపల్లి నాగ్ ...డి.వి .ఆర్...మద్దెల నగేష్ ...జూనియరు క్రికెట్టు టీము 'captain ramesh'..... లక్ష్మన తాత ...నా సహ ఖాతా దారుడు రమణ ...యేసోబు...సుబ్రమణ్యం ...నాగరాజు...మదను..స్లిప్పుల్లొ కట్ లు కొట్టే బాలక్రిష్న ...వింత డ్రెస్సుల దేవెందెర్......వీరమహేందెర్ ....సాయిబాబు ...అయ్య బాబోయ్ అసలు సంగతి మర్చి పోయా ....మా బాచు మొత్తానికి ఏకైక ' విజాతి ధ్రువపు ' అయస్కాంత శక్తి ' ' ఫణీశ్వరి '........ ఇలా చాలామంది రూపాలు నా కళ్లకు కట్టినట్టుగానే కనపడుతున్నాయి !

************************************************************************

' షూ లేసులు సరిగ్గా కట్టుకోండి '......మా అవిడి అరుపులాంటి మందలింపు తో ఇహ లోకం లోకి వచ్చి పడ్డా!
ఇప్పటికే .....మీ 'gmc-78' మీట్ ఐన తర్వాత .....ఆ యాహూ -గ్రూపు 'mails' తో కంప్యూటర్ కే 24 గంటలూ అతుక్కుపోతున్నారు.....ఈ మీట్ కూడా ఇతే అసలు ఈ లోకం లో వుంటారో లేదో '.......ఆమె యెత్తి పొడుపు కూడా చెవులకు ఇంపుగానే వినపడుతుంది !
' ముందీ కాఫీ తాగండి ' !
కాఫీ సిప్పు చేస్తూ .....ఓ సారి పేపరు అలా అలా తిరగేసా ! శాత వాహన యెలాగూ మిస్సు అయ్యింది ' గోల్కోండ' లో నైనా హైదరాబాదు వెళ్లాలని ఇంటి నుంచి బయట పడ్డా !

గోల్కొండ అంత రద్దీగా ఏమీ లేదు .........సీటు లో జారగిల పడ్డా ! మనస్సు ఓ సారి మళ్లీ 31 యేండ్ల వెనక్కు వెళ్లింది !

******** ********** ******** ***************** *********** *********
మా నాన్న గారికి నా మీద చాలా నమ్మకం .....మా వాడు కాస్తో ...కూస్తో తెలివైన వాడు ...నా పేరు యెలాగైనా నిలబెడతాడని ! నేను కూడా ఆయన నమ్మకం వమ్ము చేయలేక కష్టపడి పదవ తరగతిలొ ఫష్టు క్లాసు లో పాసు అయ్యాను . మా పరగణా (డివిజను) మొత్తం మీద ముగ్గురమే ఫష్టు క్లాసులము. మా నాన్నగారు బాగా సంతోషించి......తను కాలేకపోయిన ' ఇంజనీరు 'ను నాలోనే చూసుకుని ...యెన్నో కలలు కని ( ఆయన అప్ప ట్లో ఆర్ధిక ,కుటుంబ కారణాలవల్ల ఇంజనీరు చదవలేకపోయారు )....... నన్ను ఇంటరులో ' యం .పి .సి ' లో జాయిను చేసారు . నాకు లెక్కలంటే భయమని .....నాకు ఇది వొద్దని..... గొంతు చించుకు అరవాలనిపించినా ఆ భయాన్ని బయటకు చెప్పలేక ...టెంథ్ లో 'composite' తీసుకున్న పాపానికి నోరు మూసుకుని.....జాయిను అయిపోయా ......బూర్గంపహాడ్ జూనియరు కాలేజ్ లో!
ముచ్చ్టటగా మూడు రోజులు గడిచాయి ! క్లాస్ లో వున్నది ఇద్దరమే ....అదీ అబ్బాయిలమే....మా ఇద్దరికి చెప్పలేక ఆ వచ్చేసారు కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు ! అదుగో ......అలాంటి సమయం లోనే వచ్చొంది ....'గీతిక' ...నా హృదయ వీణియ పలికిన అనురాగ మాలిక .....నా గుండె వేదిక పై నర్తించిన ......... నాట్య ' విదూషిక ' .......నవరస భరిత కావ్య కల్పనా ' నాయిక ' !
అంత వరకూ అబ్బాయిల బడిలో చదువుకున్నానేమో...... తొలిసారిగా అమ్మాయంటే వుండే ' ఆకర్షణ ' అంటే యేమిటో తెలిసింది . అసభ్యపు అలోచనలకైతే తావే లేదు కానీ ......ఓ తియ్యని అనుభూతి....గుండె వీణియను లేత వేళ్ళతో సవరించి మేను కరగించిన పరవశపు అనుభూతి ....మాత్రం వుండేయి . ్ దాన్ని యేమంటారో మీరే చెప్పాలి ! అప్పటి దాకా యం. పి. సి. పట్ల వున్న అయిష్టం కూడా పోయి లెక్కలంటే ఇష్టం కలగ సాగింది ! అలా ఓ మూడు నెలలు గడిచాయి . ఈ లోగా .....మేము యెప్పుడో 'saagar ' కోసం రాసిన పోటీ పరీక్ష లో నేను ఒక్కడినే సెలెక్టు అయ్యాను ! మళ్ళీ కధ మొదటి కొచ్చింది ! అంతవరకూ ఇష్ట పడిన .....లెక్కలూ ....గుండె గదుల్లొ 'suareroot' మంత్రమేసుకున్న అమ్మాయి .....రెండింటినీ నిధి లేని పరిస్థితులల్లో దూరం చేసుకోవాల్సివచ్చింది . ఆ వయసులో ....విరహం అనడానికి వీలు లేదు ఎందుకంటే అది ప్రేమ కాదు .... ఇక దూరం అందామా మీము దగ్గర అయ్యిందీ లెదు .....కానీ ఈ రెండింటికీ మించిన ' ఓ చిత్రమైన అనుభూతి....స్థితి ' వుందన్న విషయం మాత్రం మనసు గుర్తించింది ! మొత్తానికి ' గురుతుకొస్తున్నాయీ ' అంటూ పాడుకోవడమే తక్కువ !

********* *********** *********** ******** ********** *********
కొత్త పెట్టె , కొత్త బెడ్డింగు ,బెరుకు-బెరుకు , బిత్తిరి చూపులతో సహా .....'tiger vally' అనబడు .....' అంధ్ర ప్రదేశ్ నైవాశ్య కళాశాల , నాగార్జున సాగరు ' లో అడుగుపెట్టాను . అంత వరకూ 'డాము' ,రిసర్వాయరు , సాగర సంగమం కోసం ఉరకలేస్తున్న క్రిష్నమ్మ అందాలు , కంటికింపుగా మనసునింపగా ......అనుభవిస్తున్న నేను... కంటగింపుగా, కంటకపు కంపగా .....కనబడుతున్న ఆ రేకుల షెడ్డులను చూడగానే......ఒక్కసారిగా యెక్కడలేని నీరసం ఆవహించింది ! ' నేను చదవబోయే విశిష్ట కాలేజీ ఇదేనా ' అనుకోగానే మనసు దిగాలు పడింది . నా చేతుల్లొ యేమీ లేదు . అప్పటికే ....టి . సి కూడా తేసేసుకున్నాం కాబట్తి ఇక్కడ జాయిను కాక తప్పదు అని అర్ధమైపోయింది . అప్పటి దాకా ఉత్సాహం నింపిన అమ్మాయి ప్రత్యక్షంగా కళ్ల యెదురు గా లేదు కాబట్టి ......మళ్లీ లెక్కలంటే భయం మొదటికొచ్చింది ! అంతవరకూ వీడు ఖ చ్చితంగా యం.పి. సి తీసుకుంటాడు అనుకుంటున్న మా నాన్నగారికి షాక్ ఇచ్చేలా ........ గుండె పొరల్లో గూడుకట్టుకున్న ఆవేదన , అసంత్రుప్తి, కోపం , కసి అన్నీ రాకెట్ వేగంతో దూసుకొచ్చి ....నన్ను ' బి.పి .సి. ' తీసుకునేలా ప్రేరేపించింది . నాన్నగారు ఎంత మొత్తుకున్నా వినక....మొండిగా నా పంతం నెగ్గించుకున్నాను ! కానీ ఇప్పుడు అనిపిస్తుంది .........అప్పుడు నాన్న మాట విని ఉంటే బాగుండు నని ! ఎంతై నా రాసి పెట్టి వుంటుందంటారు కదా ! అలా సాగర్ లొ ప్రవేశం అనే ఓ అంకం ముగిసింది !


జాయిను చేయడం ఐపోయిన తర్వాత ఆ సాయంత్రమే నాన్నగారు వెళిపోయారు. నాన్నగారు వెళ్తుంటే ...దుఖం తన్నుకు వచ్చింది .అంతవరకూ ఎదో శెలవుల్లో సరదాగా గడపడానికి ...ఇంటి నుంఛి దూరంగా వున్నానే తప్ప ఇలా దీర్ఘకాలికం గా ...చదువు నిమిత్తం 'తల్లిదండ్రులను ' వదిలి వున్నది లేనే లేదు ! గంపెడు-గుబులు నెత్తికెత్తుకున్నట్టు ....టన్నుడు దిగులు గూడు కట్టుకొన్నట్టు వుంది మనసూ- శరీరమూనూ ! ఓ పేద్ద 'బందెల దొడ్డిలొ ' బంధించినట్టు ఓ యెత్తైన ...పొడుగైన రేకుల షెడ్డులో వుంచారు మమ్మలందరినీ . నీళ్లు సరిగా రావు .బాత్రూము సౌకర్యం సరిగా లేదు ....అందరినీ కలిపి వుంచారేమో ....వద్దన్న అంటుకుంది 'గజ్జి ' మహాతల్లి , వచ్చిన వారం రోజులలోనే ! యెంత ఆప్యాయంగా మమ్మల్ని అక్కున చేర్చుకుని కౌగిలించుకుందంటే ....'ద్రుతరాష్ట్రుడి కౌగిలి ' కూడా అంత బలంగా వుండేది కాదేమో .

'గజ్జల్లో చేయేసి...తొడలు అదిమిపట్టి
ఇకిలించిన గోకిన ఇడువదు గజ్జమ్మ '
'మనసార రాకిన కలిగించు హాయమ్మ
ముట్టంటు లేదంటు తెగ పేడించె పిచ్చమ్మ ' ....అంటూ పాటలు కట్టుకుని పాడుకోవడం మా వంతైంది .

అలా మా దిగులు మర్చిపోవడానికి .....ఆ హాయి...ఇంటి నుంచి వచ్చే ఉత్తరాలే దిక్కు అయ్యయి మాకు ! అమ్మ ఉత్తరాల కోసం యెంతగా యెదురుచూసేవాడినో ! నెమ్మనెమ్మదిగా స్నేహితులకు ఉత్తరాలు రాయడం మొదలు పెట్టా . అందరికీ కలిపి ఒకే కవరులో రాసేవాడిని . వాళ్ళు కూడా ఒకే కవరులో కలిపి పంపేవాళ్లు ....'గీతిక ' కూడా ! ఆ ఉత్తరాల సావాసం లొ నెమ్మదిగా ఇంటి బెంగను మరచిపొయా! ఓ నెలరోజుల తర్వాత కాస్త కాస్త పరిస్థితులకు అలవాటు పడడం నేర్చుకున్నాం . నాకు అర్ధమయింది ఏమిటంటే ..'సర్వేలు ' ' 'తాడికొండ ' ' కొడిగెన హళ్ళి ' అనే మూడు స్కూల్సు నుండి వచ్చిన వాళ్ళు మాత్రం జట్లు -జట్లు గా తిరుగుతూ వాళ్ళ వాళ్ళ సంఘీభావాన్ని చూపించుకునే వాళ్ళు !

అంతేకాదు అచ్చం సిటీ వాళ్ళు కూడా ఓ జట్టు గా వుండే వాళ్ళు ........ఇక వొద్దన్నా వూరు వాళ్ళు అందరూ తప్పని పరిస్థితులలో ఒక్కదగ్గ రై పోవాల్సివచ్చింది . అలా ఓ మూదు నెలలు గడిస్తే కాని ......మా బై. పి.సి. వాళ్ళు దగ్గరయ్యారు......ఆ తర్వాత వేరే గ్రూపు వాళ్ళు పరిచయయ్యారు . వచ్చిన కొత్తలో గమనించలేదుకాని .... వసతుల సంగతి ఎలావున్నా ....'tigervally' మాత్రం రాను రాను అందంగా కనబడసాగింది .చుట్టు 'u' ఆకారం లో యెత్తైన కొండలు ......ఆ కొండల్ని కలుపుతూ పారుతుందా అనిపించే ' క్రిస్నమ్మ ' ...వీటి మధ్య వంపు మఖ ద్వారం లో , కొండల పాదాల చెంత ' మా కాలేజి ' . మీకు తోడు మేము వున్నామన్నట్టు ఓ ఫర్లాంగు దూరం లో ' మత్య శాఖ ' వారి ఆఫీసు . ఈ రెండింటిని విడదీస్తూ ఓ సెలయేరు ....మీము ' హీరోలము ' కాక పోయినా....' కావ్య నాయికలు ' లే్క పోయినా....ఆ ప్రదేశం మాత్రం ...కావ్యాలలో వర్ణించే ఏ వర్ణనకు తీసిపోదు ! మా క్లాసులకు యెడమ పక్కగా అందరికీ కలిపి ...ఓ నీళ్ళ తొట్టి దాని చుట్టూ చతురస్రాకారం లో ' స్టేజీ ' లా సిమెంటు తో కట్ట బడిన కట్టడం వుండేయి . యెన్నో సాయంత్రాలు....యెన్నో వెన్నెల రాత్రులు ........ అక్కడ కూర్చొని ...పాములా మెలికలు తిరుగుతూ కనబడే ' ఘాటీ ' రోడ్డు .....ఆ రోడ్డు వెంబడి మాచర్ల వైపు వెళ్ళే బస్సులను / వచ్చే బస్సులను చూసేవాళ్ళం ! రాత్రుల్లో ఐతే బస్సు లైట్లు ఇంకా చిత్రం గా కనిపించేవి. కీచు రాళ్ళ అరుపులతో .......మాకు అతి దగ్గరలో వున్న 'tunnel' గుండా ప్రవహించే నీటి హోరు తొ .....సాగర్ గేట్ల నుండి జాలువారే 'క్రిష్నా నదీమ తల్లి ' నాట్యపు జోరుతో ........వద్దన్నా ఆ ఆనంద తరంగాలలో మనసు తేలియాడేది . ఆ స్థితి కేవలం అనుభవైద్యేకం ......మాటలతో చెప్పేది కాదు ! అక్కడ నుండి రాత్రి పూట రవాణా సౌకర్యం సరిగ్గా వుండేది కాదేమో ....మేము కూడా యెటూ వెళ్ళే వాళ్ళం కాదు . ఓ విధంగా చెప్పాలంటే .............................యెటువంటి క్రుత్రిమత్వం లేకుండా కేవలం ' ప్రక్రుతి కాంత ' ఒడిలో సేదతీరేవాళ్ళము ! యేదైనా అత్యవసరమైన పని వుంటే mainroad లో కాకుండా మా కాలేజి వెనుక నున్న కొండ ఎక్కి మరీ ' దక్షిన విజయపురి ' వెళ్ళి వచ్హేవాళ్ళము . ( ఆ దారి ఇప్పుడు ఎంత మందికి గుర్తువున్నదో నాకైతే తెలియదు ). మొదటి మూడు నెలలు నెమ్మదిగా గడిచింది అని పించినా .....ఆ తర్వాతి కాలం ఎలా గడిచిందో ....సంవత్సర కాలం యెలా పూర్తి అయ్యిందో లీలామాత్రంగా కూడా గుర్తులేదు !

అవ్విధంబున ...................యేడాది కాలపు 'tigervally ' అనే అంకం ముగిసింది !
*********** *****************

దక్షిణ విజయపురి !

యెందుకు మార్చారో ఇప్పుడైతే గుర్తు లేదు కాని.....మమ్మల్ని 'tigervally' నుంచి పాత నాగార్జున కొండ దారిలో......ఇప్పుడున్న ' మేరీ మాత ఆలయం ' కి కాస్త ఇవతలిగా (అప్పుడు ...కొత్తగా కడుతున్నారు )....వున్న 'నాగార్జున సాగర్ ప్రాజెక్టు ' కడుతున్న సమయం లో వాడి నిరుపయోగం గా వున్న కొన్ని పాత షెడ్డుల సముదాయం ను లీజు కు తీసుకుని ....వాటిని కాలేజీ గా మార్చారు. మామూలుగా ఐతే ' తంతే గారెల బుట్టలో పడ్డారురా అంటారు ఎవరైనా 'newplace' కి మారితే ! కాని మా పరిస్థితి ' పెనం లొ నుంచి జారి పొయ్యిలో పడ్డట్టు ' అయ్యింది . కాస్త మనుషుల మధ్యకు వచ్చామన్నమాటే కాని.......మవులిక సదుపాయాల లభ్యత లో మాత్రం యేమీ తేడా లేదు. కాకపోతే వూరి కి ... ముఖ్యం గా బుస్సు-స్తాండు కి దగ్గరగానే వుండేది . ఒక పక్క కిరస్తానీ స్కూలూ ....మరో పక్క వూరి వాళ్ళ కాలనీ .......'maingate' కి యెదురుగా .....రోడ్డు దాటి రెండడుగులు వేయగానే.......రిజర్వాయరు కనబడుతూ ' ఈ లొకం లొనే వున్నాము' అన్న ఫీలింగు ఐతే.......వచ్చేలా చేసింది .......సరి కొత్త (పాత) కాలేజీ !
'టైగర్ వాలీ ' అంత అందంగా లేదు కానీ.......ఇక్కడున్న ప్రత్యేకత ఇక్కడుంది . విద్యాపరంగా వంక పెట్టే పనే లేదు !

ఇక మా గురువుల విషయానికి వస్తే .....మొదటి సంవత్సరంలో ఎవరున్నారో......గురుతులేదు కానీ , రెండవ సంవత్సరపు గుర్తులు మాత్రం ఇంకా సజీవం గానే నిక్షిప్తమై ఉన్నాయి ...................... !
మొదట గా 'hindi' .......!

దాదాపు ఖమ్మం జిల్లాలో .....అప్పట్లో ....హిందీలో .....84 మార్కులు అంటే ఓ విధంగా చెప్పాలంటే ' గిన్నీసు ' రికార్డ్ లాంటిదే . ఆ ధ్యైర్యం తోనే ' రెండవ భాషగా' హిందీ తీసుకున్నాను . దానికి మాస్టారు.......' వీరభద్ర రావు ' గారు ! భారీకాయం తో ....అచ్చమైన పంచె కట్టు తో ...మూర్తీభవించిన పండితుడిలా వుండే వారు ! ' నర్సోజి 'అనే మరో మాష్టారు కూడా వుండే వారు కానీ......ఎందుకో వీ.భ. రా. గారే స్మ్రుతి ఫధం లో నిలిచిపోయారు !

ఆ తర్వాత .......'english'!
పర భాష ఐనా..... ఈ మాత్రం పట్టు ఇంకా మిగిలి వుందీ అంటే.......అందులో ' ' నరసింహా రావు ' గారి పాత్ర ఎంతైనా వుంది. 'grammer' + ' గంభీరత ' = న.సిం.రావు గారు అనుకునే మమ్మల్ని ..............................
'grammer' + 'glamour' = 'కోరమీసపు' న .సిం . రావు గారు అనుకునేలా చేసారు . ఇక జయరామి రెడ్డి అని మరో సారు వుండేవారు. ..........ఆయన క్లాసు లో మాత్రం నవ్వులు పువ్వులై పూసేయి !

ఇక 'physics'................!
లెక్కలంటే వున్న భయం కొద్దీ.........'physics' అంటే చాలా భయంగా వుందేది. కానీ ఆ భయాన్ని ' సాలగ్రాం ' సారు దాదాపు పోగొట్టేరు . పొట్టిగ్గా ...పిల్లి కళ్ళతో ....ఆకర్షనీయమైన రూపంతో ఆకట్టుకునే వారు. మెడిసిను లో సీటు రావడానికి ఆయనా ఒక కారకుడే !

పోతే 'chemistry'...........!
అది 'history' అంత 'mistory' కాకపొఇనా.........'organicchemistry ' మాత్రం గొంతు పట్టుకునేది. ' ప్రేం చంద్ ' అని ఓ సారు బండిని బాగానే లాగించేవారు !

అన్నింటికి మించి 'zooalogy'........!
నాకు + మాకు ఇష్టమైన ' సబ్జెక్ట్టు ' జువాలజి . స్వతహాగా నాకు బొమ్మలేయడమన్నా .......'dissection' లు చేయడమన్నా చాలా ఇష్టం ! దానికి తోడు అప్పటి నా ' క్లోజు ఫ్రెండు ' 'suneel ' బొమ్మలు చాలా బాగా వేసేవాడు . ఆయనను మించి వేయాలని ఎప్పుడూ తాపత్రయ పడే వాడిని ! అలా............. ' కోదండరాం ' మరియు ' రవి ' సార్ల పర్యవేక్ష్ణణలో ....'lab' లో కులాసాగా....దిలాసాగా....గడిపేవాళ్ళం !

చివరాకరుది ......కాదు....అదే అసలైనది .....'botany'........!

'subject' అంటే ఇష్టం వున్నా ......కేవలం ఒకే ఒక వ్యక్తి .......' ఒకే ఒక్కడు ' ' ఒక్క మొగాడు ' వల్ల అది ' సింహ స్వప్నమై ' కూర్చుంది ! ఆయనే .................'' ఖాదర వల్లి ''..........'కాదు ఇంట్లో పిల్లి ......గోడ మీద బల్లి'.
....మంచం లో నల్లి ....కలలో కూడా వదలని ' సైతాను -తల్లి '.....వెరసి అప్పట్లోనే మాకు ' రంకు మొగుడు ' అంటే ఎలా వుంటాడో తెలియ చెప్పిన .....' రాక్షస బల్లి '. ఆయన గారి గురించి చెప్పాలంటే ఓ గ్రంధమే అవుతుంది.
అందుకే ఆయన గురించి ప్రత్యేకం గా వేరే ' దొంతర ' పేరుస్తా !

       ''య్యో...... ఏం సామీ ! సీటు మొత్తం నువ్వే కూసుంటావా ఏమి  ? ఆన్న అరుపుతో ....జబ్బ చరుపు తో మళ్లీ ఈ లోకం లోకి వచ్చిపడ్డా ! అరుపుకి చరుపుకి చిరాకేసి కోపం గా సౌండ్ వచ్చిన వైపు తిరిగా  !చూద్దును కదా చాల పెద్దాయన .  ఏమి అనలేక సర్దుకు కూర్చున్నాను ! కానీ ఆయనగారి మాటలు  వింటుంటే ఏదో తలపు వచ్చి -రానట్టు అనిపించి కాస్త గట్టిగా చించా అదేనండీ ఆలోచించా  ! ఈ మాటలు ఎక్కడో విన్నట్టు వుందే .....అని అనుకుంటుండగా.........స్ఫురణకు వచ్చింది ......ఆ మాటలు అచ్చం మా సాగర్ కాలెజీ లో ఫిజికల్ డైరెక్టరు చంద్రశేఖర్ సార్ లా వుందని. మల్లీ ఓ సారి రీలు వెనక్కు తిరిగింది. 
 *********************************************************************************************** 
                '' ఫూ '' అంటూ విశిల్ సౌండు  ......''య్యో '' అంటూ అరుపు ....'' ధనాధన '' మంటూ తలుపు చప్పుడు అన్నీ కలసి ఒకేసారి వినబడడం తో ఉలిక్కి పడి లేచా ! కాసేపటి దాకా యెమీ అర్ధం కాలే .....అసలు ఏమి జ రుగుతున్నది.... నేను యక్కడ వున్నదీనూ. ' య్యో' ఆన్న అరుపుతో ....బలవంతం గా ఈలోకం లోకి వచ్చి ...అలా అరుస్తున్నదెవరా అవి చూద్దును కదా మా పి. డి . సారు . ఇదు గంటలకే ' డ్రిల్లు' ...అందుకే ముందే లేపారు. మూతలు పడుతున్న కళ్ళతో ...కిందికి దిగి ( అయ్యా మావి టూ-టైరు మంచాలి....కిన్దొకడు..పైనొకడు ) ...కాల కృత్యాలు తీర్చుకుని ......బూట్లు వేసుకుని లేసులు కట్టుకుని ........డ్రిల్లు కి వెళ్లి చూద్దునుకదా .....' లేటు ' అంటూ ఉరిమి చూసారు . ఆ రోజూ డ్రిల్లు తర్వాత ....ఎకస్ట్రా   రౌండ్లు . ఆయన గారి దెబ్బకు దడిసి  అసలు కాల -క్రుత్యాలనే ' వాయిదా వేసుకునేంత గా ఎదిగిపోయాము . అర్ధగంట సేపన్నా హాయిగా పడుకోవచ్చు అని.....బూట్లు కూడా కాళ్ళకే కట్టుకుని పడుకోవడం అలవాటు చేసుకున్నాము.( ఈ బద్ధకం అప్పటి నుంచే ఉందన్న మాట ). మొత్తానికి రాళ్ళు రప్పలతో నిండిన '  చిన్న పాటి   అడవిలా '  ఉన్న ఆ ప్రాంతాన్ని ....మా కాలి , కర సేవలతో ....ఓ .....చదునైన ప్రదేశం గా మార్చి ' క్రికెట్టు-a టీము ' , క్రికెట్టు- b -టీము ' లుగా మేమూ ఆడెంత చదునైన ప్రదేశం గా మార్చామంటే అది మా ఘనతే ! దీనికి మా జూనియర్లు అందరూ రుణ పడి ఉండాల్సిందే ! మొత్తానికి ఆ సారు దయవల్ల......కాస్త ఆటలు బాగానే ఆడి  ఒళ్ళు పెంచుకునే స్థాయికి ఎదిగాము........ఆ నూనూగు మీసాల ప్రాయంలో !( ఆ సారు గురించి మల్లీ రాస్తా ........సాగర పయనం పోస్ట్ లో ).


          '' కూలీ'' '' కూలీ '' ఆన్న అరుపులతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చా . చూద్దును కదా ' ఎర్ర మల్లెలు' ( ఎర్ర చొక్కాలు ) తో  బొగీ అంతా నిండిపోయింది. మనసంతా ఉద్విగ్నంగా వుంది . 32  ఏండ్లు అయ్యింది ఎవరినీ ( రాములు ...రమణ బాబు తప్ప ) చూడక . బాబుఖాన్  ఎస్టేట్  లో వై. వి . ఆర్  ఆఫీసు వుంది . అక్కడి నుండి  ' కంట్రి క్లబ్ ' కు కలిసే వెళ్లాలని  ముందే అనుకున్నాం ! స్టేషను బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని ' బషీర్ బాగ్ '  బయలు దేరా!  'అసలు ఈ కలయిక జరగా డానికి  కారణ భూతుడైన  వై. వి ఆర్ ....అడ్రసు , ఫోను నంబరు ఎలా దొరికింది  అన్న విషయం నెమరు  వేసుకోవడానికా '..... అన్నట్టు మనసు మళ్ళీ ఆలోచనా స్రవంతి  లో పడిపోయింది . పొనీలె ఇంకా అర్ధ గంట టైం వుంది కదా అని దాన్ని అలానే వదిలేసా !


***********************************************************************************************


   నాకు 2008 వరకు ' కంప్యూటరు ' పరిజ్ఞానమే లేదు ! 2008 లో మొట్ట మొదటి సారిగా మా మెడిసిను బాచ్ కలయిక  ఆగస్టు లో జరిగింది . ఆ తర్వాత మా  స్నేహితుల ' యాహూ గుంపు ' ఏర్పడి మెయిల్సు పంపుకోవడం ....చూసుకోవడం మొదలయ్యి తప్పనిసరిగా ' అంతర్జాల భాష ' నేర్చుకోవడం  అనేది అలవాటయ్యింది . ఇంతలో ' ఆర్కుట్ ' గురించి తెలిసింది . అందులో ' కమ్యూనిటీస్ ' గురించి  తెలిసింది . ఎందుకైనా మంచిదని ఓ మెసేజ్  పెట్టా........నవంబరులో ' రెండవ బాచ్  వాళ్ళు ఎవరైనా వున్నారా ' అని !ఎవరూ సమాధానమైతే ఇవ్వలేదు కానీ ' లక్ష్మీ నారాయణ' అనే  మూడవ బాచ్ అబ్బాయి మాత్రం తన బాచ్  గురించి నాలానే వెదుకుతూ కన బడ్డాడు ! సరే ఓ రాయి వేద్దామనిపించి ఓ మెసేజ్ పెట్టా ' మిత్రమా ...నీకు మావాల్లెవరైనా తెలుసా ' అని ! దానికి ప్రతిగా ఆయన '' మీ వాళ్ళ సంగతి మొత్తం గా ఐతే తెలియదుకానీ ......వై. వి. ఆర్ అనే మకానుభావుడు ( అదేనండీ ..మహానుభావుడు ) నాకు సాగర్ లోనూ , బాపట్ల అగ్రి . లోనూ సీనియరే ''.........అంటూ ఫోను నెంబర్ ఇచ్చాడు . ఇంకేం ........తీగ దొరికింది కదా డొంకంతా లాగుదామనుకున్నా! కానీ నాకేం తెలుసు ఆ మహానుభావుడు ' ఘజనీ ' లా మారాడని ! ' జయహో ...నైవాస్య కళాశాలా  ' అని పాట పాడా ....గుర్తు పట్టలే ! '' మెహబూబా ....మెహబూబా '' అంటూ పాట పాడా.......ఊహూ గుర్తుపట్టలే . 
       ' ఇవన్నీ కాదు కానీ ' జనవరి-4 ' న మనమందరం  కలుస్తున్నాం  నువ్వు వచ్చేయ్ ' అని  ముక్తాయించాడు.  ' అదీ మా ఆఫీసు కు వచ్చేయ్ అక్కడ నుంచి కలిసి వెళ్దాం ' అని నిన్న గాక మొన్ననే  ఆంటే ఇదిగో ఇలా బయలుదేరి ఆటోలో కూలబడ్డా. మొత్తానికి ' బాబూ ఖాన్ - ఎస్టేటు '  కు చేరుకొని ఓ  రింగిచ్చా ! ' తను , డి.వి. ఆర్. కృష్ణ మోహన్ మరియు మురళీధర్  మెట్లు దిగుతున్నామని .....నన్ను  పార్కింగ్ దగ్గరే ఉండమని  ' అని వై. వి .ఆర్. ఫోనులో చెప్పాడు . మిగతా వాళ్ళు నా గ్రూపే ( బై.పి.సి) కాబాట్టి వాళ్ళ పేర్లు గుర్తుండటమే కాకుండా వాళ్ళ అప్పటి మొహాలు కూడా కళ్ళముందు కదలాడ సాగాయి . ఇంతలో ఓ మూడు శాల్తీలు మెట్లు దిగి పక్కనే ఉన్న  ' తవేరా ' వాహనం వైపు వెళ్తూ...వెళ్తూ....నా వేపు అనుమానంగా చూడసాగాయి  .  నేను కూడా అదే లెవలు అనుమానంతో వాళ్ళ వైపు పరీక్షగా చూద్దును కదా.......ఓ మొహం మాత్రం చుసిన మొహం లానే అనిపించింది ............ మురళీ ధర్......... టక్కున వెలిగింది  బల్బు . మరింత పరీక్షగా చూస్తే ఇంకో శాల్తీ కూడా చూసినట్టే అనిపించింది దూరం నుంచి కూడా ........ఆ మొహం ........ఎస్ ....కృష్ణ మోహన్ ది . మూడవ ' కొబ్బరి కాయ ' లా ఉన్న తలకాయ .....కొంప దీసి వై.వి.ఆర్ కాదు గదా అనుకోగానే బుర్ర గిర్రున తిరిగింది. అది వై.వి ఆరే ! అరె.......ఎలాంటి మనిషి ఎలా ఐపోయాడు అనిపించింది . పర్సనాలిటీ అంతా బాగానే వుంది కానీ అప్పటి అమితాబ్ బచ్చన్ స్టైలు  జుట్టు కు ఇప్పటి ఈ జుట్టు లేనితనానికి .....ఏ మాత్రం పొంతన కుదర కుండా వుంది మొహం ....పోల్చుకో వీలు లేకుండా ! మొత్తానికి సంభ్రమాశ్చర్య  నవ్వు మొహాల తోనే ఒకరినొకరు పలకరించుకొని ' కంట్రి క్లబ్ ' కు బయలు దేరాము !

**************************************************************************************

                                        







IndiBlogger - The Indian Blogger Community








Thursday, March 18, 2010

అడవి రాముడు -అపూర్వ కలయిక


అడవి రాముడు -అపూర్వ కలయిక !


( అవును మీరు చదివింది నిజమే ....ఇది నా సాగర మిత్రుల కోసం....వేరే వారు చదివితే ...వారికి శతకోటి వందనాలు....అలమలలు )

ఇదేదో యతి కోసమో ....ప్రాస కోసమో ....పెట్టిన పేరు కాదు .ఖఛ్ఛితంగా రెండింటికి సంబంధం వుంది !అడవి రాముడు లేకపోతే .......ఈ అపూర్వ కలయిక లేదు ...ఈ శీర్షికకు అర్ధమూ లెదు. చదవండి ..... మీకే తెలుస్తుంది !

అడవి రాముడు !

ఇది ఇప్పటి మాట కాదు.....నా ఇంటరు కాలేజి చదువుతున్న రోజులు. ఆంధ్రావని కే తలమానికమైన 'అంధ్రప్రదేశ్ నైవాశ్య (రెసిడెన్షియల్ )' కళాశాల ',నాగార్జునసాగర్ లో చదువుతున్న రోజులు !  మీకు తెలియనిది కాదు ......అప్పట్లో 'అడవిరాముడు ' అంటే అలాంటి ఇలాంటి 'సినిమా' కాదు !నందమూరి చిత్రరాజములలో  'మకుటాయమానం' గా శోభిల్లిన  ' సూపరు డూపరు ' హిట్టు సినిమా .అదుగో...అలాంటి సమయం లోనే తగిలాడు మాకు 'అడవిరాముడు '. వెనకకు వంపులు తిరిగిన జుట్టుతో ...కాస్త మెడను వంకరగా వంచి 'రెక్లెస్ 'గా ఏమీ  పట్టనట్టు వుండే...అప్పట్లొనే ,........అన్నిట్లొనే......... 'దేశముదురు ' ఐన వై.వి.ఆర్. ! అప్పట్లొ ఆయన పూర్తి పేరు కూడా మాకు తెలిసింది కాదు !
'స్టడీ హవరు '( స్టడీ పీరియడు ) యెగ్గొట్టి సినిమా లు ఎల్లా చూడాలొ ఆయన గారి దగ్గరే నేర్చుకున్నాము ! ఆ కాలం లొ ....ప్రసార మధ్యమాలు లేవు కాని.....వుంటే మాత్రం 'గిన్నీసులూ -పిన్నీసులు ' అన్ని రెకార్దులు బద్దలు అయ్యేటివి .అలాంటి రికార్దు స్రుష్టించాడు అతగాడు. "అడవిరాముడు ' సినిమాను వంద సార్లకు పైగా చూసిన 'చదువుకున్న-కుర్రకారు ' అసలు వున్నాడంటే నమ్మదగ్గ విషయమేనా ? కలలో కూడా సాధ్యమఏ  పని కాదు ! ఓ సామాన్యుడికి ఐ.పి.యల్ టికెట్టు దొరికి ...ప్రీతి జింటా పక్కన కూర్చొని ...నవ్వుతున్నప్పుడు పడె ఆమె 'బుగ్గ-సొట్ట ' ను చూస్తూ ....గుటకలు మింగలెక ....లొట్టలేసుకుని కూల్ డ్రింకు తాగినంత 'నమ్మ లేని కలలాంటి నిజం '! ఆ నిజంలొ మేము కూడా భాగస్వామ్యులమే !
తానొక్కడే చూడడం కాకుండా....యధాశక్తి జేబు కరిగేలా ....కాళ్ళు అరిగేలా (బస్సులు...ఆటోలు లేవుగా ) మా అందరికి చూపించడమనేది సామాన్యమైన విషయం కాదు !అలా జీవితానికి పునాది ఐన ఇంటరు రోజుల్లొనే ..'హగ్గీస్ ఆడ్' అంత బోసినవ్వుల ..బోసిమొలంత స్వఛ్ఛమైనది అనను కాని.....భేషజాలు లేని ....కల్మషాలు లేని సన్నిహిత సహచరులలో ఓ 'విలక్షనమైణ 'వ్యక్తిగా మిగిలి పోయాడు.........'' అడవిరాముడు '' !!!!!!!

//సీను కట్ చేస్తే............31 సంవత్సరాల తర్వాత ....ఒంటెలు బెల్లు ( అదెనండి...ఇంటెరువెల్లు ) !//
దొంతరలు.......అనగానే ఇవెవో మందు పాతరలు అనుకునేరు . మనసు పొరల్లొ....పదిలపరచబడిన 'అనుభూతుల దొంతరలు ' !అవి మంచివె కావొచ్చు లేక చెడ్డవే కావొచ్చు . ఉదా : ఇదవ తరగతిలొనే అమ్మాయి కొసం చెట్టు యెక్కి జాంపండు కొసి ....చెతుల్లొ పెడితే .....ప్రసంసాపూర్వకంగా మెరిసే కళ్ళతో నవ్విన అమ్మాయి నవ్వంత అందమైనదీ కావొచ్చు !ఆ మెప్పు కొసమె పొటీ పడిన మిత్రుడినే ........ అకారణంగా చితక్కొట్టినందుకు నాన్న చేత బెల్టు దెబ్బలు తిన్నంత భయంకరమైనవీ కావొచ్చు ! అవేవైనా కావొచ్చు.....వాటికున్న స్థానం వాటి కుంటుంది . గుండె గదిలొ......అవి పదిలం .....పదిలం !!!!!!!!!!!!!!!!!!!